Penchalakona.co.in

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి, ఆదిలక్ష్మీ అమ్మవార్ల అభిషేకము మరియు పూజకు కావలిసిన వస్తువులు

1. పసుపు - 100 గ్రాములు

2. కుంకుమ - 200 గ్రాములు

3. తమల పాకులు - 1 కట్ట

4. వక్కలు - 50 గ్రాములు
5. కడ్డీలు - 1 ప్యాకెట్
6. కర్పూరం - 1 ప్యాకెట్
7. టెంకాయలు - 2
8. అరటి పండ్లు - 6(అర డజను)

9. విడిపూలు - 100 గ్రాములు

10. కట్టిన పూలు - 10 మూరలు

11. కలశానికి గ్లాసు - 1

12. ఆచమనమునకు గ్లాసు - 1

13. తులసీ దళములు

14. పూలమాలలు - 2

15. రవిక (జాకెట్ పీస్) - 1

16. దీపములు - 2

17. గంధం - 1/2 కిలో 

18. పాలు - 2 లీటర్లు

19. పెరుగు - 2 లీటర్లు

20. తేనె - 1/4 లీటర్లు

21. పంచదార 1/2 కిలో

22. 5 రకముల పండ్లు

23. జీడిపప్పు - 200 గ్రాములు

24. ఎండు ద్రాక్ష - 200 గ్రాములు

25. కొబ్బరి బోండాలు - 5

26. పన్నీరు - 1 డబ్బా

27. వట్టి వేరు - 100 గ్రాములు

28. బాదం పప్పు - 100 గ్రాములు

29. శ్రీవార్లకు వస్త్రములు

30. నెయ్యి- 1/4 కేజీ



శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహ స్వామి షోడశోపచార పూజ


ఆచమ్మ :


1. కేశవాయ నమ:


2. నారాయణాయ నమ:


3. మాధవాయనమ:


(కుడి చేతిలో మూడు సార్లు నీరు పోసుకుని త్రాగాలి)


భూతోట్పాటనమ్:


ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే |


(అని అక్షింతలు వాసన చూసి ఎడమ ప్రక్కగా వెనకకు వేసుకోవాలి)


ప్రాణాయామము :


ఓం.. ... .ఓం.


సంకల్పం : శ్రీ గోవింద గోవింద గోవింద శ్రీమహా విష్ణోరాజ్ఞేయా


ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః, ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే, వైవస్వతమన్వంతరే, కలియగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే, కృష్ణా కావేర్యోః మధ్య దేశే, శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహ స్వామి దేవతా దివ్య చరణసన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ... సంవత్సరే ఆయనే.. ..ఋతౌ .మాసే .వాసరే .నక్షత్రే శుభ యోగ శుభ కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమతః. .గోత్రస్య .నామధేయస్య మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్యర్థం యిష్టకామ్యార్ధ సిద్యర్ధం సత్సంతాన సౌభాగ్య శుభఫలా వాప్త్యర్ధం మమ మనస్సంకల్ప సిద్యర్థం శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహ స్వామిదేవతాప్రీత్యర్ధం పురాణోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోప చార పూజాంచ కరిష్యే









శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము


కలశారాధన :


కలశమునందు గంధం పుష్పం అక్షింతలు వేసి కలశము మీద కుడిచేతిని ఉంచి క్రింది శ్లోకమును చెప్పవలెను.


శ్లోకము :


కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదో హ్యథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః


శ్లోకము :


గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ॥ ఆయాంతు శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహ స్వామి దేవతా పూజార్ధం దురితక్షయ కారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య (కలశములోని నీటిని పుష్పముతో తీసుకుని పూజాద్రవ్యముల మీద చల్లుకోవాలి)


1. ధ్యానమ్ : సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యస్థితమ్


యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్జ్వలమ్ త్ర్యక్షం చక్ర పినాక సాభయ కరాని భ్రాణ మర్కచ్ఛవిమ్ ఛత్రీభూత ఫణింద్ర మిందుధవళం లక్ష్మీనృసింహం భజే లక్ష్మీ చారు కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసే నమో నృసింహ నాథాయ సర్వమంగళ మూర్తయే ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూయోల్లాసిత సంసార చ్చేద హేతుం జగద్గురుమ్ శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ధ్యానం సమర్పయామి (అని అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను)





















శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము


2. ఆవాహనం


: ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సృసింహం భీషణం భద్రం మృత్యో, మృత్కుం సమామ్యహం


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ఆవాహనం సమర్పయామి (అని అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


3.ఆసనం :


నారసింహ మహాసింహూ దివ్యసింహ మహాబలః ఉగ్రసింహ మహాదేవ స్తంభజ శ్చోగ్రలోచను


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ఆసనం సమర్పయామి (అని అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


4. అర్హ్యం :


రౌద్రస్సర్వాద్భుత శ్రీమాన్యోగానంద స్త్రివిక్రమః హరిః కోలాహలశ్చక్రీ విజయీ జయవర్ధనః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః అర్ఘ్యం సమర్పయామి


(అని పుష్పముతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


5. పాద్యం:


పంచాననః పరంబ్రహ్మ చాఘోరో ఘోరవిక్రమః జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః పాద్యం సమర్పయామి (అని పుష్పముతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


6. ఆచమనం :


నిటలాక్షి సృహస్రాక్షో దుర్నిరీక్షః ప్రతాపనః మహాదంష్ట్రా యుధః ప్రాజ్ఞ శృండకోలీ సదాశివ


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ఆచమనం సమర్పయామి (అని పుష్పముతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల వద్ద వేయవలెను)






శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము


7. స్నానం :


హిరణ్యకశిపు ధ్వంసీ దైత్య దానవ భంజనః గుణభద్రో మహాభద్రో బలభద్ర సుభద్రకః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః స్నానం సమర్పయామి (అని పుష్పముతో నీటిని తీసుకుని స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


8. వస్త్రం:


కరాలో వికరాళత్స వికర్తా సర్వకర్మకః శింశుమార స్త్రీలోకాత్మ ఈశ స్పర్వేశ్వరో విభుః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః వస్త్రం సమర్పయామి (అని అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను.)


9. ఉపవీతం :


భైరవాడంబరో దివ్య శ్చాత్యుతః కవిమాధవః అధోక్షజోక్షర శ్శర్వో వనమాలీ వరప్రదః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి (అని అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


10. గంధం :


విశ్వంభరోద్భుతో భవ్యః శ్రీవిష్ణుః పురుషోత్తమః అనఘాస్తో నఖాస్త శృ సూర్యజ్యోతి స్సురేశ్వరః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః గంధం సమర్పయామి (గంధమును స్వామివారి పాదాల వద్ద వేయవలెను)


11. ఆభరణం:


సహస్ర బాహు స్సర్వజ్ఞ స్సర్వసిద్ధి ప్రదాయకః వజ్రదంష్లో వజ్రనఖో మహానందః పరంతపః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ఆభరణం సమర్పయామి (అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను)







శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము


సర్వమంతైక రూపశ్చ సర్వయంత్ర విదారణః


పూజయామి


సర్వతంత్రాత్మకో వ్యక్త సుృవ్యక్తో భక్తవత్సలః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః పుష్ప మాలాం సమర్పయామి (ఇచ్చట యథాశక్తిగా సహస్రనామం లేక అష్టోత్తర శతనామాలు చెప్పుచూ పూలు లేక తులసీదళములతో స్వామివారిని పూజింప వలయును.)


13. :


వైశాఖ శుక్ల భూతోత్థ శృరణాగత వత్సలు ఉదారకీర్తి: పుణ్యాత్మ మహాత్మా చండవిక్రమః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః ధూపం ఆఘ్రాపయామి (కడ్డీలు వెలిగించి స్వామివారికి చూపవలెను)


14. ໖:


వేదత్రయ ప్రపూజ్య శ్చ భగవా స్పరమేశ్వరః శ్రీవత్సాంక శ్రీనివాసో జగద్వ్యాపీ జగన్మయః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః దీపం దర్శయామి (స్వామివారికి దీపమును చూపవలెను)


15. నైవద్యం :


జగత్పాలో జగన్నాథో మహాకాయో ద్విరూపభృత్ పరమాత్మా పరంజ్యోతి ర్నిర్గుణ శ్చ నృకేసరీ


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః నైవేద్యం సమర్పయామి (కొబ్బరికాయ లేక అరటి పండ్లు స్వామివారికి నివేదన చేయవలెను)


16. తాంబూలం


: పరతత్వం పరంధామ సచ్చిదానంద విగ్రహః లక్ష్మీనృసింహ స్సర్వాత్మా భరః ప్రహ్లాద పాలకః


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః తాంబూలం సమర్పయామి (తాంబూలమును స్వామివారి పాదాల వద్ద ఉంచవలెను)


23






శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజా విధానము


నీరాజనం:


దుష్టగ్రహ రుజారిష్టా ద్యాపదాం. విని వారిచే ప్రహ్లాద రక్షకాయాస్తు శ్రీ నృసింహాయ మంగళం పుళింధశ్రీ సమేతాయ వాంచితార్ధ ప్రదాయినే 0మహాశిల గిరిశాయ శ్రీ నృసింహాయ మంగళం


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించి స్వామివారి చుట్టూ మూడు సార్లు త్రిప్పవలెను)


మంత్ర పుష్పం


: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే | యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధి పోత, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ॥


శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహాయ నమః మంత్ర పుష్పం సమర్పయామి


(అక్షింతలు పూలు స్వామివారి పాదాల వద్ద వేయవలెను) ఏతత్ఫలం శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహ స్వామినే నమః దివ్య చరణార విందార్పణ మస్తు


శ్రీ ఛత్రవటి క్షేత్ర చరిత్ర
శ్లో॥ జ్వాలాహోబిల మాలోల క్రోడా కారశ్చ భార్గవః । యోగానంద శ్చత్రవట: పవనో నవ మూర్తయః॥ శ్లో॥ ఆదిలక్ష్మీ సమేతాయ వాంచితార్ధ ప్రదాయినే । మహాశిల గిరీశాయ శ్రీ నృసింహాయ తే నమః ॥
శ్రీ నవ నారసింహ పుణ్య క్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, గోనుపల్లి గ్రామమునకు 7 కి. మీ. దూరమున నెల్లూరు పట్టణమునకు పశ్చిమ భాగమున 80 కి.మీ. దూరములో ఉన్నది. ఇచ్చట లక్ష్మి నరసింహ స్వామి నవ నారసింహులలో ఒకరుగా పిలవబడుచున్నారు. శ్రీ స్వామివారు చెంచులక్ష్మీ సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలసి యున్నారు. అల్లంత దూరమున ఆదిలక్ష్మీ అమ్మవారునూ స్వయంభువుగా వెలసి ఈ దేవ దేవేరులు భక్తాభీష్ట ఫలప్రదులై బ్రోచేవారలను కరుణించి ఫలముల నొసంగుచున్నారు. దశావతారములలో మేటియై కృతయుగమున అవతరించిన నాలుగవ అవతారము నృసింహావతారము. ఈ అవతారమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణలు అనగా దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లాద రక్షణ చేసి తనచే సృజింపబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమైనారు. ఇట్టి క్షేత్రములలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రము అత్యంత మహిమాన్వితమైనది. నృసింహావతారమున హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు సర్వం విష్ణుమయం జగత్ అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవాప్తియై భక్తుల అభీష్టము మేరకు అచ్చటచ్చట అవతరించినాడు. ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నారసింహుడు సుందరాంగియైన చెంచు వనిత చెలిమితో శాంతించి చెంచురాజులకు కప్పము చెల్లించి చెంచుపట్టిని చేపట్టి పరిణయమాడి ఆ సుందర వనితను పెనవేసుకొని నిరాకార శిలా రూపమున స్థిరమైనట్లు చరిత్ర వలన తెలియచున్నది.

ఈ క్షేత్రము తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున సముద్ర మట్టమునకు సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్నది. ఈ స్వయమవతారమూర్తి వెనుక భాగమున మహాశిల గిరి(గొప్ప పర్వతరాజము) కలదు. ఇది పన్నగాకృతిగా నెల్లూరు, కడప, జిల్లాల మధ్య భాగమున హిమగిరితూర్పు పశ్చిమ సముద్రములకు కొలబద్దమానముగా నున్నట్లు, ఉత్తర దక్షిణముగ, శ్రీశైల, వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్దవలె కన్పించును. ఈ సర్పాకృతిగాకల పర్వతముల యొక్క శిరోభాగమున వరాహక్షేత్రమున వేంకటేశ్వరుడు వెలసెను. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రము) ఛత్రవటి నారసింహుడు వెలసి స్థితి కారకుడై తనను ఆరాధించు భక్తులకువరములు నొసంగుచుండ లయ చక్రవర్తియైన పార్వతీశు డు శ్రీశైల క్షేత్రమున వాల(అంత్య) భాగమున వెలసి ఆర్తులను ఆనందింపజేయుచున్నాడు. ఈ గిరి శిఖరముల నుండి జాలువారు వర్షపు నీటి ధారలు వెండికరిగి మూసలో పోయురీతిన స్వచ్ఛముగా నుండి పర్వతపాద భాగమున ఉన్న కణ్వనదియందు ప్రవేశించి తద్వారా దిగువ గల గ్రామాలకు వరప్రసాదియై కండలేరు జలాశయమున నిక్షిప్తమగుచున్నది. ఈ క్షేత్ర నదీ తీరమున శాకుంతల సంరక్షకుడైన కణ్వ ఋషి మహాతపమోనర్చి స్వయంభువైన శ్రీనృసింహుని ఆరాధించినట్లు పరంపరాగతమైన దివ్య. సూక్తి. అలనాడు మహర్షులచే ఆరాధింపబడిన పెనుశిలేశుడు ఈనాడు భక్త సులభుడై కోరిన వరములు ఇచ్చుచున్నాడు. ఈ స్వామి చెంచు వనితైన లక్ష్మిదేవిని పెనవేసుకొని అవతరించి యుండుటచే పెనుశిల క్షేత్రమే కాలగమనమున రూపాంతరము చెంది పెంచలకోనగా మారి పామరుల హృదయములలో స్థిర నామ రూపమైనది. ఈ ప్రాంతము వారు నేటికినీ తమ సంతానములకు పెంచలయ్య, పెంచలమ్మ అని స్వామి వారి పేరు పెట్టుకొనుట జరుగుచున్నది. ఈ పర్వతారణ్య మహాక్షేత్రమున మహోత్సవములకు (నృసింహాజయంతి) వచ్చు అసంఖ్యాక భక్తకోటికి క్రిమి కీటకాది బాధలు కూడాకలుగవు. ఇచ్చట సేవ చేయువారికి సర్వగ్రహదోషములు నివారణ అగును, మరియు సంతానము లేనివారు వరపడు సేవచే సంతాన ప్రాప్తులగుదురు. ఇది నేటికిని సత్యముగా జరుగుచున్నది. ఈ క్షేత్రమున ప్రతిదినం త్రికాలారాధనలు జరుగుచున్నవి. వైశాఖ మాసమున బ్రహ్మోత్సములు, ఆశ్వీయుజ మాసమున శరన్నవరాత్రి ఉత్సవములు మిక్కిలి శోభాయమానముగా జరుగును. ఈ క్షేత్రమున క్షేత్రపాలకుడుగా శ్రీఆంజనేయ స్వామివారిని ఆరాధించుచున్నారు. పూర్వము గోనుపల్లి గ్రామమునకు సమీపమున ఉన్న అరణ్యము నందు ఆవులను మేపుకొను గొల్లబోయునకు శ్రీవారు నేను ఈ కొండల నడుమ శిలారూపమున వెలియచున్నాను. కావున నీవు మీ గ్రామమునకు వెనుతిరిగి చూడకుండా పోయి గ్రామ పెద్దలకు తెలియజేసి నా వద్దకు రావలసినదిగా చెప్పినారు. శ్రీహరి భక్తుడైన గొల్లబోయుడు గోనుపల్లి సమీపమునకు వెళ్ళి వెనుతిరిగి చూడగా శ్రీహరి మాటను ధిక్కరించినందులకు గాను స్వామివారు కోపించి శిలారూపమును దాల్చమని శపించెను. అంతట గొల్లబోయుడు అజ్ఞానముతో చేసిన తన తప్పును క్షమించమని ప్రార్థించగా భక్తసులభుడైన శ్రీహరి శాంతించి తన వద్దకు వచ్చు భక్తులు ప్రథమముగా నిన్ను దర్శించి పిదప నన్ను దర్శించెదరని గొల్లబోయునకు వరమొసంగెను. ఈ గోల్లబోయని ఆలయము గోనుపల్లి గ్రామమునకు సమీపమున ఉన్నది. మరియు సప్తఋషుల నామములతో సప్త సరస్సులు రమణీయమైన ఈ ప్రదేశమున నెలకొనియున్నవి. ఈ క్షేత్రమున స్వామి వారికి ముఖ్యదినము శనివారముగా భావించి భక్తులు కొనియాడెదరు. శ్రీవారికి జరుగు బ్రహ్మోత్సవములు, వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై శు ద్ధ చతుర్దశి (జయంతిరోజు) గరుడసేవ ప్రధానముగా పాంచరాత్ర ఆగమానుసారం పంచాహ్నికముగా జరుగును. శ్రీ నృసింహజయంతి గరుడ సేవరోజు శ్రీవారిని సేవించుకొను భక్తగణము అసంఖ్యాకముగా వచ్చుదురు. ఈ క్షేత్రమునకు సమీపమున 5 కి.మీ. దూరమున భైరవకోన యను పుణ్య స్థలము గలదు. అచ్చట శ్రీవారి మహోత్సవ పూర్వోత్తర కాలమందు సుమారు ఒక నెల వరకు శ్రీ స్వామి వారి స్నానాద్యనుష్టానములను కావించు కొందురని ఆ సమయమున సప్త ఋషులు స్వామి వారికి దివ్యఛత్రము పట్టెదరని నానుడి. ఈ దృశ్యమును నేటికిని భానోదయ కాలమున భక్తులు తిలకించుచుందురు ఈ కారణములచేత స్వామి వారికి ఛత్రవటి నారసింహ స్వామి అనెడి పేరు సార్ధకమైనది.

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి సుప్రభాతము

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే | ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్। ఉత్తిష్ఠ జగతాం మాతః ఉత్తిష్ఠ హరి వల్లభే | ఉత్తిష్ఠ కమలే దేవి సుప్రభాతం ప్రబుధ్యతాం॥

శ్లో॥ శ్రీ భిల్ల లక్ష్మీ నరసింహ మహోర సీడ్మే, సుప్తాని శామ గమయః పరిభుజ్యభోగాన్ | కారుణ్య పూర్ణ హృదయే కరుణా కటాక్షైః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ సూషా సమాగత వతీ సుషమైక భూషా, మోషేన కాలి పరి కల్పిత దివ్య వేషా ! అస్యాం ప్రసారయ దృశః ప్రథమం నృసింహ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ ప్రాచీ దిగద్య తమసా పరి ముచ్య మానా, సర్వం ప్రబోధ యతి చేతనజాతయైషా ॥ కూజంతి మంజు శకునాః శుక శారి కాద్యాః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ స్వీకృత్య సౌరభ మయం వికస త్సుమేభ్యః, మందం పవత్యుషసి గంధ వహస్సుశీతల్లి త్వద్దివ్య గాత్ర మధి వాసయితుం నృసింహ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

బాలారుణాం శుక మనోజ్ఞ తనుర్ద నశ్రీః, రంగస్థలం ప్రవిశతి ప్రథమాద్రి శృంగమ్ | ఉత్సార్యతే యవనికా వ్యధునైవ హైమీ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

త్వాం సేవితుం సుత కాస్త రవో లతాశ స్వాన్ భూషయన్తి కుసుమైః రుచిరైః ప్రభాతే । నృత్యంతి బరిణ గణాః ఆపి నారసింహ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

స్నాతా హిమేన సువిభాత రుచం వసానా, బాలార్క రమ్య తిలకా ప్రకృతి ప్రియాతే | ప్రాభోది కాంగ సుషుమాం భవతోధి దృక్షుః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

గాయన్తి భిల్ల వనితా స్తవ దివ్య గాథాః, స్వీయోటజాం గణభువః పరిమంద యస్యః ! అంబారవ స్మరతి వాత్సర దైను కోతః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

త్వా ముద్వహన్ గిరివర స్సుమహాశిలాభ్యః, పృచ్ఛత్యయం తవనికా శయనీయ సౌఖ్యం ! పుంస్కో కిలస్య విరుతై ర్మధురై స్సభక్తి, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ భాస్వానయం సముదయన్ మృదులై స్వహస్తిః, సద్యో వికాస ముపయన్తి సరోరుహాణి । 1 స్వైరం చినోతి భవదంత్రి యుగార్చనాయ, శ్రీమన్ మహాశిల గిరిశ్వర సుప్రభాతమ్ ॥

స్వామిన్ సరాంసి సరసీరుహ దివ్య గంధైః, ఆవాసితాని మధురాణి సుశితలాని । స్నానాయతే పరి వహంతి వయాంసి దేవ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో। ఏతే దినాధి పతీయ స్సహ సిద్ధ సాధ్యాః, సర్వే గ్రహాధి పతయశ్చ సహాది తేయాః । త్వద్దర్శనాయ నిభృతం పరి పాలయస్తే, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ స్తంభో ద్భవం మునివరా స్తవ సాంధ్య కాలే, దృష్ట్వా సుర క్షపణ ముగ్ర వినిగ్రహంచ। భక్తావన ప్రవణ తాంచ ముదా గృణంతి, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ ప్రహ్లాద విష భవదాలయ మేత్య భళ్వా, సానన్ద భాష్ప పులక స్తవ నామ రమ్యమ్ । ఆవర్త యత్యమల భావనయా న్నసింహ, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ శ్రీమానయం వకుళ భూషణ దివ్య సూరిః, రామానుజో యతి పతశ్చ దయైక సింధుః త్వద్దివ్య మంగళ గుణా నిహ కీర్తయేతే, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ వ్యాఖ్యాతి సోయ మనఘః కమలేశ రమ్మ, జామాతృ యోగి గురురాట్ ద్రావిడ స్తుతీస్తా । శ్రీ దివ్య సూరి రచితాః మధురాష్త్ర భావొః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ శ్రీ వైష్ణవా శుచయ పత్య ధృతోర్ధ్వ పుండ్రాః, భక్తాంఘి రేణు రచితా మధ గోదయాచ । ప్రాభాతకం స్తుతి మియేత్ర పఠంతి రమ్యమ్, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ |

శ్లో। ఏషోర్చకః స్వ శిరసా కలశం ప్రగృహ్య, తీర్థం పవిత్ర మభిషేచ యితుం ప్రపన్నాః । దేవాధునా నయతి సన్నుత కణ్వ నద్యాః, శ్రీమన్ మహాశిల గిరీశ్వరసుప్రభాతమ్ ॥

శ్లో॥ అశ్వోత్థమః కరివరః కుసుమాని ధేనుః, ఛత్రం సచామర యుగం ముకురః ఫలాని ! ఏతాని పశ్య నృహరే ప్రథమం ప్రబుద్ధః, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥

శ్లో॥ దిక్షు ప్రతి ధ్వనతి మంగళ తూర్య ఘోషః, త్వత్పూజ నోప కరణానిచ సాధితాని । భక్తానిమా నను గృహాణ భవద్ధి దృక్షూన్, శ్రీమన్ మహాశిల గిరీశ్వర సుప్రభాతమ్ ॥ ఇతం మహాశిల గిరీశ్వర సుప్రభాతం, ప్రాతః పఠం త్యనుదినం య ఇహాతి భక్త్వా | తేషాం భవన్తి సకలా న్యపి మంగళాని, శ్రీ మన్నృసింహ భగవత్కరుణా కటాక్షై ॥

స్తోత్రము

శ్లో శరణం భవత శరణ జగతాం భవభీకర సాగర నిస్తరణా । కరుణా వరుణా లయహే స్నేహరే విజయీ భవభో విజయీ భవభోగా

శ్లో వరమీన తన కమటాధిపతిః కిటి రూప ధరశ్చ భవన్ భగవన్, జగతా మదితాని సదా దయయా విజయీ భవభో విజయీ భవభోః ॥

శ్లో। నరసింహ మహాధ్భుత వామనహ జమదగ్ని సుతారణ వంశ మణే | బలరామ యదూద్వహ కల్కితనో విజయీ భవభో విజయీ భవభోః

శ్లో. సుధాంశు ప్రభా భాసితో ధూయమానం, సటా మండలం తం నృసింహస్య రమ్యం । తదాస్యేందు బింబం పరిష్కర్వ దస్మాన్, పరిత్రాతు నానా మయా పద్మ్భ యేభ్యః ।

శ్లో ముదా పుష్ప వర్షే సురైఃకీర్యమాణే మునీంద్రేషు శాంతింభియా ప్రార్ధయత్సు జగత్కంట శోధ్ధార భక్తా వనాభ్యాం ప్రసన్నం సదాహం భజే తం నృసింహం ॥

శ్లో। నారదా ద్వైర్ముదా గీయమానా నిశం వైనతేయా దిభి సేవ్య మాన స్వయం స్తంభ స్పంభూత హేభక్త చింతామణే శ్రీనృసింహ ప్రభో పాహిమాం పాహిమా౦॥

శ్లో॥ ఉపాసితం మునీశ్వరై ర్ముదేడితం సురేశ్వరైః కవీశ్వరైశ్చ వర్ణితం మహాత్మభిస్తదార్చితం | పవిత్ర గంగ వారిభిః పవిత్ర యజ్జగత్రయమ్ న్నసింహ పాద పఙజ ద్వయం వహం భజామహే।

శ్లో॥ నక్రగ్రహ క్షపిత విక్రాంత మబ్జ కర మాకంద మాన మగతిం, దంతా వళేంద్ర మయి సంతాప హీన హృదమంత స్పరస్సమతనోః ప్రహ్లాద మధ్య పునరాహ్లాద యన్నవసి సంహ్లాదనా శ్రితవతాం భక్తంజనంక ఇహనక్తం దివం త్వమివ శక్తివితుం నరహరే ॥

శ్లో॥ జగదుదయా భ్యుదయా వ్యయ కారణ కారణ వీక్ష్మ జితాన్, అసుర వరై స్సమరే ష్వమరా నమరా నమరాధి పతే దయయా | ఘన కనకాసుర మఖ్య మహాసుర వీరణ దారణ చారు కృతే, జయ జయహే నృహరే కుహరే జగతామిహ సద్యశసాం మహసా ॥

హిరణ్య కశిపో 6ుర స్థల విదారణ విశ్రుతం. తదీయ ఘన శోణిత చ్చురిత మిందు బాసుందరం । ససింహ కరశాభికా మధుర మండనం సంతతం. సంత్ర కచ మస్తువ కలుష దారణే షేచితం :

శ్లో. దంష్ట్రా కరాళ మతి లోహిత లోల జిహ్వం, శోణాక్ష మూర్జితరవం కలి తాట్ట హాసం. వక్తం తవాస్తు శుభదం ధనుజేంద్ర హస్తు శ్రీమన్న సింహ చరణి శరణం ప్రపద్యే

శ్లో అజ్ఞాన సంతమస కల్మష కర్త మాద్య, సంసార గర్త పతితం గళితాత్మశక్తిం మాముద్దరస్వ కరుణా మయ భక్త వత్య శ్రీమన్న సింహ చరణ్ శరణం ప్రపద్యే

శ్లో హస్త ద్వయా భరణ శంఖ సుదర్శనాభ్యాం. హస్తేన బాభయ ముదీరయతా స్వభక్తాన్: ఆశ్వాసయన్ కమలయా పరిరద్ద దేహ, శ్రీమన్నృసింహ చరణ్ శరణం ప్రపద్యే

బ్రహ్మాది దేవై సముపాస్య మానం, ప్రహ్లాద ముబ్వై రవి పూజ్యమానం : లోకైసమసై రభి వంద్య మానం, లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే

శ్లో॥ దుష్ట గ్రహ రుజారిష్టా ద్యాపదాం విని వారిణే, ప్రహ్లాద రక్షకాయాస్తు శ్రీ నృసింహాయ మంగళం!

శ్లో పుఔంధశ్రీ సమేతాయ వాంచితార్ధ ప్రదాయినే, మహాశిల గిరీశా య శ్రీ నృసింహాయ మంగళం.

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః, సర్వైశ్చ పూర్వై రాచారైకి సత్కతా యాస్తు మంగళం!

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం

శ్రీమత్పయో నిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీన్నసింహ మమదేహి కరావలంబమ్ బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టి కాంఘై కమలామల కాంతికాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ॥ సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగ లసదూర్మి నిపీడితస్య లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార ఘోరగహనే చరతోమురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్థితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీనృశింహ మమదేహి కరావలంబమ్ ॥ సంసార కూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ! కృపయా శరణాగతస్య లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిప్పీద్యమాన వపుషస్సక లార్ధితస్య ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార సర్ప విషదష్ట భయోగ్రతీవ్ర దంష్టా కరాళ విషదగ్ధ వినష్టమూర్తే నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే ! లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేన్దియార్ధ బడిశశ్చ ఝషాత్మనస్య ప్రోత్తంబిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార వృక్షమఘ బీజమనన్తకర్మ శాఖాయుతం కరణపత్ర మనంగపుష్పం ఆరుహ్య దుఃఖ జలధా పతతో దయాళో లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార దావ దహనాకుల భీకరోగ్ర జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య త్వత్పాద పద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ ప్రహ్లాదఖేద హరిహార పరావతార లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥ సంసార యూధ గజసంహతి సింహదంష్టా భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీనృశింహ ! మమదేహి కరావలంబమ్ ॥

Table of Contents